ఫస్ట్ నైట్ గదిలోకి వచ్చిన భర్తకు షాకిచ్చిన భార్య

ఫస్ట్ నైట్ గదిలోకి వచ్చిన భర్తకు షాకిచ్చిన భార్య

వారిద్దరికి కొత్తగా పెళ్లయింది. ఆ రోజే ఇరుకుటుంబాల పెద్దలు కొత్త దంపతులకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. వధువు గదిలో భర్త కోసం ఎదురుచూస్తోంది. వరుడు ఎన్నో ఆశలతో గదిలోకి అడుగుపెట్టాడు. తలుపుతీయగానే.. వరుడు తల మీద రాడ్డుతో వధువు గట్టిగా కొట్టింది. అదేంటి మొదటి రాత్రే అలా ఎందుకు చేసింది అనుకుంటున్నారా? అయితే కంటిన్యూ చేయండి..

ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్‌కు చెందిన యువతికి.. బిజ్నోర్‌లోని కుండా ఖుర్ద్ గ్రామానికి చెందిన యువకుడికి ఈ నెల 15న స్థానికంగా ఉన్న ఆలయంలో వివాహం జరిగింది. అనంతరం భార్యతో కలిసి పెళ్లి కొడుకు తన ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇల్లంతా బంధువులతో సందడిగా మారింది. అదే రోజు రాత్రి దంపతులకు మొదటి రాత్రికి ప్లాన్ చేశారు. గదిలో ఉన్న భార్య దగ్గరకు భర్త వస్తూ.. గడియ తీయగానే వధువు ఒక ఇనుప కడ్డీతో బలంగా కొట్టింది. దాంతో వరుడు స్పృహ తప్పిపడిపోయాడు. వెంటనే వధువు గదిలో ఉన్న డబ్బులు, నగలు తీసుకొని పరారయింది. 

కాసేపటి తర్వాత ఇది గమనించిన వరుడి బంధువులు ఇల్లంతా వెతకగా.. వధువు డబ్బులు, నగలతో పరారయిందని గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు వరుడు ఫిర్యాదు చేశాడు. ‘అసలు ఏం జరిగిందో నాకు తెలియడంలేదు. గదిలోకి వెళ్లగానే నా భార్య ఒక రాడ్డుతో నా తల మీద బలంగా కొట్టింది. దాంతో నేను అపస్మారకస్థితిలోకి వెళ్లాను. లేచిన తర్వాత తెలిసింది.. ఆమె నగలు, డబ్బులతో పారిపోయింది’ అని వరుడు పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వధువు మరియు పెళ్లి కుదిర్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.