అయ్యో పాపం: ఈ కుర్రాడికి ఎంత కష్టం వచ్చింది.. పెళ్లయిన రాత్రే...

అయ్యో పాపం: ఈ కుర్రాడికి ఎంత కష్టం వచ్చింది.. పెళ్లయిన రాత్రే...

పెళ్ళిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని చెబుతారు. ఎక్కడో పుట్టి పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్ళి అనే బంధంతో ఒక్కటై జీవితాంతం కలసి ఉండటం ఈ బంధం మీద గౌరవాన్ని, పవిత్ర భావాన్ని పెంచుతుంది. ఇదే భావంతో ఓ జంట పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది. స్నేహితులు, బంధుమిత్రులతో పెళ్ళి మండపం కళకళలాడింది. కానీ పెళ్ళిజరిగిందన్న ఆనందం లేకుండానే భార్య చేసిన పనికి వరుడితో పాటు అతని కుటుంబం కూడా అయోమయంలో పడిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే...

 రాజస్థాన్‌లోని పాలి నుంచి దొంగ పెళ్లికూతురుకు సంబంధించిన మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. వివాహం జరిగిన రాత్రే వధువు డబ్బుతో ఉడాయించింది. దీంతో ఖంగుతిన్న వరుడు.. బ్రోకర్ ను డబ్బులు అడగడంతో అగంతకుల చేతిలో తన్నులు తినాల్సి వచ్చింది. అంతేనా.. పాపం అతడికి కరెంటు షాక్‌ కూడా పెట్టారు. ప్రస్తుతం వరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పోలీసుల తెలిపిన సమాచారం ప్రకారం.. 

పాపరం కుమావత్ అనే వ్యక్తి వివాహం జూన్ 2023లో ఒక బ్రోకర్ ద్వారా జరిగింది. పెళ్లికి పాపరం 5 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాడు. పెళ్లయిన రాత్రి బయటికి వెళ్తానని చెప్పిన వధువు.. ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. వరుడు వెంటనే బ్రోకర్‌ని సంప్రదించగా వస్తుందని బొంకాడు. అయితే కొన్ని రోజులు వేచి చూసినా ఆమె తిరిగి రాకపోవడంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరాడు.

దీంతో బ్రోకర్ రాత్రిపూట వరుడి పొలంలో నిర్మించిన ఇంటికి అరడజను మంది దుర్మార్గులను పంపాడు. వాళ్లు వరుడిని తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో పాపారం పక్కనే వెళ్తున్న కరెంటు తీగ నుంచి కూడా విద్యుత్ షాక్‌ ఇచ్చారు. ఈ ఘటన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బాధిత వరుడిని ఆస్పత్రికి తరలించారు. రాజస్థాన్‌లో ఇలాంటి కేసులు ఈ మధ్య తరుచూ కనిపిస్తున్నాయి. పెళ్లిళ్ల పేరుతో మోసాలకు పాల్పడే ముఠాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. ఈ కేసుల్లోని బాధితులు తరుచూ వెలుగులోకి వస్తున్నారు.