గుర్రమెక్కిన పెళ్లి కూతుళ్లు

గుర్రమెక్కిన పెళ్లి కూతుళ్లు

మధ్యప్రదేశ్: మనకు తెలిసినంతవరకు ఎక్కడైనా పెళ్లి జరగగానే బందువులంతా కలిసి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిని బరాత్ తీస్తూ ఇంటికి తీసుకువెళ్తారు. కానీ, మధ్యప్రదేశ్‌లోని ఒక సామాజిక వర్గానికి చెందిన పెళ్లి కూతుళ్లు మాత్రం పెళ్లి తర్వాత తమ భర్త ఇంటికి గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్తారు. సాక్షి మరియు స్రిష్టిలు ఇద్దరు అక్కాచెల్లేల్లు. వారి వివాహం జనవరి 22న జరిగింది. వీరు కూడా తమ సామాజిక వర్గ సాంప్రదాయం ప్రకారం.. ఖండ్వాలోని తమ భర్తల ఇంటికి గుర్రంపై వెళ్లారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

వధువుల త్రండి మాట్లాడుతూ.. ‘ఇది పాటిదార్ సమాజానికి చెందిన పాతకాలం నాటి సంప్రదాయం. మహిళలను కూడా పురుషులతో పాటు సమానంగా చూడటమే దీని లక్ష్యం. ఈ సాంప్రదాయం ‘బేటీ బచావో’కు దగ్గరిగా ఉంటుంది’ అని అన్నారు.

For More News..

అమ్మాయిలతో కలిసి ‘రొమాంటిక్’ స్కామ్

ఆమెను కూడా నిర్భయ దోషులలాగే జైళ్లో పెట్టాలి

వరల్డ్ రికార్డ్: 75 ఏళ్ల వయసులో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా..