పన్నెండు కోట్లతో కడితే ప్రారంభానికి ముందే కూలింది

పన్నెండు కోట్లతో కడితే ప్రారంభానికి ముందే కూలింది
  • బిహార్​లో పేకమేడలా కూలిన బ్రిడ్జి 

అరారియా: బిహార్​లో రూ.12 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే కూలింది. అరారియా జిల్లాలో కుర్సకాంత, సిక్తి ప్రాంతాల మధ్య బాక్రా నదిపై బ్రిడ్జి నిర్మించారు. దీనికి ఇంకా అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడంతో ప్రారంభించలేదు. అయితే మంగళవారం బ్రిడ్జిలోని కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానికులు అది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయింది.

నిర్మాణ కంపెనీ నిర్లక్ష్యంతోనే బ్రిడ్జి కూలిపోయింది. దీనిపై విచారణ జరిపించాలి” అని సిక్తి ఎమ్మెల్యే విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ‘‘కూలిన బ్రిడ్జిని రూరల్ వర్క్స్ డిపార్ట్ మెంట్ అధికారులు పరిశీలిస్తారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని జేడీయూ లీడర్ నీరజ్ కుమార్ తెలిపారు.