ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

క్రిస్మస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేడుకలను ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్టియన్లు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సూర్యాపేటలో జరిగిన వేడుకల్లో మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, మఠంపల్లిలో ఎంపీ ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హాజరయ్యారు. క్రిస్మస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం పాస్టర్లు క్రీస్తు సందేశాన్ని వినిపించారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.     - వెలుగు నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌    

వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి యాదిలో... 

భారతరత్న, మాజీ ప్రధాని వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి జయంతిని ఆదివారం ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ లీడర్లు వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఆధ్వర్యంలో దుప్పట్లు, స్వెట్టర్లు పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కడియం రామచంద్రయ్య ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సూర్యాపేటలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు పాల్గొని వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి ఫొటో వద్ద నివాళి అర్పించారు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ - వెలుగు నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రవాణా రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

కోదాడ, వెలుగు : రాష్ట్రంలో రవాణారంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆదివారం జరిగిన లారీ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమావేశంలో వారు వేర్వేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి మాట్లాడుతూ రవాణా రంగ సమస్యలను పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. 

కోదాడ లారీ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ రవాణా రంగానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక రాయితీలు ఇచ్చిందన్నారు. లారీ ఓనర్ల సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, పద్మావతిరెడ్డి పాల్గొన్నారు.

చంద్రమౌళికి నివాళి అర్పించిన ఎమ్మెల్సీ

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా హాలియాకు చెందిన, కోదాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుకుడాల చంద్రమౌళి ఆదివారం గుండెపోటుతో చనిపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి హాలియాలోని చంద్రమౌళి ఇంటికి వచ్చి ఆయన డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీకి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

ఆయన వెంట జడ్పీ వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరిగి పెద్దులు, తిరుమలగిరి (సాగర్) ఎంపీపీ భగవాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయక్, కాకునూరి నారాయణగౌడ్, చింతల చంద్రారెడ్డి, కుందూరు వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, వెంపటి శ్రీనివాస్, ఆవుల పురుషోత్తం, అల్లి పెద్దిరాజు యాదవ్, కున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కృష్ణారెడ్డి ఉన్నారు.

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే...

కోదాడ, వెలుగు : రాష్ట్రంలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కనగాల నారాయణ, స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నూనె సులోచన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం  ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన పలువురు మహిళలు ఆదివారం బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రధాని మోడీ పాలనకు ఆకర్షితులయ్యే చాలా మంది బీజేపీలో చేరుతున్నారన్నారు. పార్టీ నాయకులు సట్టు రంజిత్, వంగాల పిచ్చయ్య, మునగాల శ్రీనివాస్, పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

గెలుపోటములను సమానంగా తీసుకోవాలి

యాదగిరిగుట్ట, వెలుగు : ఆటల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని డీసీసీబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొంగిడి మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. ఆటల వల్ల  శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో మహేంద్ర యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. 

స్టూడెంట్లు చదువుతో పాటు ఆటల్లో కూడా పాల్గొనాలని, ఆ దిశగా పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో మదర్ డెయిరీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆలేరు వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డమీది రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జడ్పీటీసీ అనురాధ బీరయ్య, సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీ వెంచర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధినేత నారాయణగౌడ్, కేసరి యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు రేగు బాలనర్సయ్య పాల్గొన్నారు.

రెడ్డి కులస్తులంతా ఐక్యంగా ఉండాలి

సూర్యాపేట, వెలుగు : రెడ్డి కులస్తులంతా ఐక్యంగా ఉండాలని విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. సూర్యాపేట పట్టణంలోని డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మర్రి లక్ష్మారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం నిర్వహించిన రెడ్డి ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద స్టూడెంట్ల ఉన్నత చదువుల కోసం రెడ్డి సంఘం నుంచి సాయం చేయాలని సూచించారు. రెడ్డి సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూశామని, త్వరలోనే బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మిస్తామని చెప్పారు. 

అనంతరం రెడ్డి సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించి, 10 మంది స్టూడెంట్లకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. సమావేశంలో రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు గవ్వ మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, భూమిరెడ్డి, దేవిరెడ్డి రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, చిలుముల సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కొండపల్లి దిలీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, బీరవోలు రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, నూకల వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, దండా వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.