మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

గద్వాల, వెలుగు: ప్రభుత్వం టీచర్ల ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్లు, ప్రమోషన్లను దసరా సెలవుల్లో చేపట్టనుందని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి చెప్పారు. ఆదివారం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో పీఆర్టీయూ ఆఫీసును టీపీఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంతో టీచర్ల సమస్యలపై చర్చించామని, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్లు, ప్రమోషన్లతో పాటు 317 జీవోతో ఇబ్బందులు పడుతున్న టీచర్ల సమస్య కూడా పరిష్కారం అవుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఫండ్స్ రూ. 15 లక్షలతో ఎంఏఎల్‌‌‌‌‌‌‌‌డీ డిగ్రీ కాలేజీలో చేపట్టిన అభివృద్ధి పనులను జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ స్టేట్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ కమలాకర్ రావు, జిల్లా ప్రెసిడెంట్ తిమ్మారెడ్డి, సెక్రటరీ వేణుగోపాల్, గౌరవ అధ్యక్షుడు నరసింహారెడ్డి, రాష్ట్ర నాయకులు పరమేశ్వర్ రెడ్డి  పాల్గొన్నారు.

మంత్రిపై చర్యలు తీసుకోవాలి

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: ప్రీడమ్‌‌‌‌‌‌‌‌ ర్యాలీలో వేల మంది  స్టూడెంట్స్ మధ్య  గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌‌పై  చర్యలు తీసుకోవాలని బీజేపీ స్టేట్ ట్రెజరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండారి శాంతికుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ జాతీయ జెండా ఆవిష్కరించే ముందు, ర్యాలీలు ప్రారంభించే ముందు శాంతికి ప్రతిరూపమైన పావురాన్ని ఎగరవేయాలి గాని,  మంత్రి హోదాలో ఉండి కాల్పులు జరపడం ఏంటని మండిపడ్డారు.  జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్లపై జాతీయ జెండా ఒకవైపు ముద్రించి, మరో వైపు తెలుపు రంగుతో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వం జెండాలను పంపిణీ చేయడం లేదనడం అవివేకమని విమర్శించారు.   అనంతరం బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ వీరబ్రహ్మచారి,  నాయకులు పడాకుల సత్యం, శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య  ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై  చర్యలు తీసుకోవాలని టౌ టౌన్ పీఎస్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేశారు.  

ఉనికి కోసమే  కాంగ్రెస్ పాదయాత్ర 

అయిజ, వెలుగు:  కాంగ్రెస్‌‌‌‌ నేతలు ఉనికి కోసమే పాదయాత్ర చేస్తున్నారని, అయిజ మున్సిపాలిటీ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని మున్సిపల్ చైర్మన్ చిన్నదేవన్న సవాల్‌‌‌‌ విసిరారు.  ఆదివారం మున్సిపల్ ఆఫీస్‌‌‌‌లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.  అయిజ మున్సిపాలిటీలో అభివృద్ధి జరగలేదని  ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అనడం సరికాదని,  ఇప్పటికే రూ. 50 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.   సీసీ రోడ్లు, డ్రైనేజీలు,  మినీ బ్రిడ్జిలు, డివైడర్లు, వైకుంఠధామాలు.. ఇలా ఎన్నో పనులు చేపట్టామన్నారు.  అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో అయిజ 2వ స్థానంలో ఉందని స్పష్టం చేశారు.  కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు  కబ్జా చేసిన భూమిని మున్సిపాలిటీకి  ఇస్తే  కొత్త మున్సిపల్ భవనం నిర్మిస్తామన్నారు.  ప్రెస్ మీట్ లో కౌన్సిలర్లు శ్రీరాములు, ఆంజనేయులు పాల్గొన్నారు.

సీపీఐని బలోపేతం చేయాలి

పాలమూరు, వెలుగు:  గ్రామాల్లో సీపీఐని బలోపేతం చేయాలని  ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పరమేశ్ గౌడ్ పిలుపునిచ్చారు.  ఆదివారం మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ మండలం బండమిదిపల్లిలో  జిల్లా కార్యవర్గ సభ్యుడు రామ్మోహన్ ఆధ్వర్యంలో సీపీఐ మండల మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరమేశ్ గౌడ్ మాట్లాడుతూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు  విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలం అయ్యాయన్నారు.  2014 ఎన్నికలకు ముందు పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పిస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు సంతోశ్, బాలస్వామి, నేతలు  నరసింహ, లక్ష్మయ్య, కేశవులు, ఆంజనేయులు, వాసు, పెంటయ్య, భాగ్యలక్ష్మి, పద్మ, మల్లేశ్వరి,శాంతమ్మ,  చిట్టెమ్మ పాల్గొన్నారు. 

దళిత బంధు దేశానికే ఆదర్శం

అడ్డాకుల, వెలుగు: దళిత బంధు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌‌‌‌ రెడ్డి అన్నారు.  ఆదివారం అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన 10 మంది లబ్ధిదారుల యూనిట్లను  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య వచ్చి 75 ఏళ్లు అవుతున్నా గత ప్రభుత్వాలు దళితులను పట్టించుకున్న పాపాన పోలేవన్నారు. సీఎం కేసీఆర్‌‌‌‌ దళితులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో దళితబంధు కింద రూ.10 లక్షలు ఇస్తున్నారన్నారు.  నియోజకవర్గానికి 3 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరయ్యాయని, ఇందులో  గ్రామానికి అవకాశం ఇస్తామని  హామీ ఇచ్చారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ రిజైన్ చేయాలి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఫ్రీడం రన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా గన్‌‌‌‌‌‌‌‌ పేల్చిన ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని టీపీసీసీ సెక్రటరీ ఎన్‌‌‌‌‌‌‌‌పీ వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ వేల మంది స్టూడెంట్ల మధ్యలో కాల్పులు ఎలా జరుపుతారని,  ఏ చట్టం ప్రకారం అనుమతి ఇచ్చారో ఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పాలని నిలదీశారు.  ఎస్పీ ఓ మాట , మంత్రి ఓ మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వెంటనే మంత్రిపై కేసు నమోదు చేసి, విచారణ చేయాలని డిమాండ్ చేశారు. 

ఊట్కూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిఫ్ట్ నుంచి నీటి విడుదల

అలంపూర్, వెలుగు: అలంపూర్ మండలంలోని ఊట్కూరు లిఫ్ట్ నుంచి ఆదివారం ఎమ్మెల్యే అబ్రహం మోటార్‌‌‌‌‌‌‌‌ను ఆన్‌‌‌‌ చేసి నీటిని విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.14.50 కోట్లతో చేపట్టిన ఈ లిఫ్ట్‌‌‌‌ పనులను  కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ కొంత పెండింగ్‌‌‌‌లో పెట్టాడన్నారు. మరో రూ. 55 లక్షలు  మంజూరు చేయించి  త్వరలోనే మిగిలిన పనులు  పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో లిఫ్ట్ చైర్మన్ నర్శన్‌‌‌‌ గౌడ్ , మాజీ ఆలయ చైర్మన్ నారాయణ రెడ్డి ,  పార్టీ మండల అధ్యక్షుడు బీచుపాల్లి యాదవ్ , మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మణ్‌‌‌‌ పాల్గొన్నారు.