లిజ్ ట్రస్​తో చర్చలో ఆకట్టుకున్న బ్రిటిష్ ఇండియన్ నేత 

లిజ్ ట్రస్​తో చర్చలో ఆకట్టుకున్న బ్రిటిష్ ఇండియన్ నేత 

లండన్:  బ్రిటన్ ప్రధాని రేసులో వెనుకం జలో ఉన్న బ్రిటిష్ ఇండియన్ నేత, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్  ఓ టీవీ డిబేట్ లో మాత్రం పైచేయి సాధించారు. అధికా ర కన్జర్వేటివ్ పార్టీ లీడర్షిప్ ఎన్నిక కోసం జరుగుతున్న పోరులో విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ కన్నా ఆయన వెనుకంజ లో ఉన్నట్లు ఇప్పటివరకూ జరిగిన సర్వే లు తేల్చాయి. అయితే, గురువారం ‘బ్యాటిల్ ఫర్ నెంబర్ 10’ పేరుతో స్కై న్యూస్ చానెల్ నిర్వహించిన లైవ్ డిబేట్ లో లిజ్ ట్రస్, రిషి ముఖాముఖి చర్చలో తలపడ్డారు.

చర్చలో కన్జర్వేటివ్ పార్టీ మెంబర్లు వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు రిషి చక్కటి సమాధానాలు ఇచ్చి ఆకట్టుకున్నారు. డిబేట్ అనంతరం ఎవరు గెలిచారని అనుకుంటున్నారో చేతులెత్తాలంటూ ప్రశ్నిం చగా.. ఎక్కువ మంది పార్టీ సభ్యులు రిషికి మద్దతుగా చేతులెత్తారు. సర్వేల్లో వెనుకబడినందు న పోటీ నుంచి తప్పుకోవాలని అనుకుం టున్నారా? అని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లేదని రిషి జవాబిచ్చారు. చివరి రోజు వరకూ సభ్యుల మద్దతు కోసం ప్రయత్నిస్తానని చెప్పారు.