
బ్రిటిష్ కార్ మేకర్ లాంజాంటే(Lanzante) తమ కొత్త హైపర్‌కార్ 95-59 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కార్ రేటు అక్షరాలా రూ.12 కోట్ల 50 లక్షలుగా ఉంది. 3 -సీటర్ల ఈ సూపర్కార్లు కేవలం 59 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది కంపెనీ. 95-59 అనే పేరు 1995లో Lanzante గెలుచుకున్న 24 గంటల లే మాన్స్ రేస్‌లోని విజేత కార్ నంబర్ నుంచి తీసుకోబడింది.
ఇక్కడ అన్నింటి కంటే ముఖ్యమైన విషయం కారు లోగో. అవును ఈ కార్ లోగోగా భారతీయ దేవుడైన గణేశుని ప్రతిరూపం కలిగిన ప్రత్యేక లోగోను కంపెనీ సిద్ధం చేసింది. ఇది బ్రిటిష్ కంపెనీ నుంచి భారతీయ సాంస్కృతిక అనుబంధాన్ని తెలియజేస్తుంది. కార్లో 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్ ఉంది. దీని పవర్ 850 హార్స్‌పవర్‌కు పైగా ఉంటుంది. 7- స్పీడ్ గేర్‌బాక్స్‌తో పవర్‌ను రియర్ వీల్స్‌కి పంపుతుంది. McLaren F1 గాడ్యాన్సీని గుర్తు చేసే ఈ హైపర్‌కార్ డ్రైవర్ మధ్యలో కూర్చోవటానికి వీలుగా 3 సీట్ల ఏర్పాటు చేయబడింది.
ALSO READ : భారీగా పెరిగిన హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్స్..
కారు బాడీ పూర్తిగా కార్బన్ ఫైబర్ తో తయారు చేయబడింది. అలాగే 1250 కిలోల హెవీ బాడీ వెయిట్ వల్ల కారు గరిష్ఠ వేగాల వద్ద ప్రయాణించటానికి వీలు కలుగుతుంది. ప్రత్యేకంగా గణేష చతుర్థి సమీపంలో ఈ కార్ విడుదలైనప్పటికీ భారతీయులలో విపరీతమైన ఆకర్షణను చూసింది.
ఈ హైపర్‌కార్ పట్టణాల్లో, కార్ లవర్స్ కి కలెక్టబుల్ ఐటమ్ గా నిలవనుంది. ఇంజినీరింగ్, డిజైన్ సహా ఒక సాంస్కృతిక గుర్తింపుతో కూడిన Lanzante 95-59 ప్రపంచ ఆటో పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొట్టమొదటి సారిగా బ్రిటిష్ సూపర్‌కార్ బ్రాండ్ ఇండియన్ ఆధ్యాత్మికతను జతచేసింది.