
భారతదేశంలో రోజురోజుకూ పెరుగుతున్న మెడికల్ ఖర్చులతో సామాన్యులు అప్రమత్తం అవుతున్నారు. చిన్న రోగంతో ఆసుపత్రికి పోయినా వేలు, లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితుల్లో కుటుంబానికి అండగా ఆరోగ్య బీమా పాలసీ తప్పనిసరి అని చాలా మంది గ్రహిస్తున్నారు. ప్రధానంగా కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ ఆవస్యకతను గుర్తించి ముందుకు సాగుతున్నారు.
2026 ఆర్థిక సంవత్సరంలో తమ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను భారతీయులు అధిక సంఖ్యలో రెన్యూవల్ చేయించుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా అందుబాటు ధరలో పాలసీలు, అధిక కవరేజ్ అందించే పాలసీల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపించిందని పాలసీబజార్ నివేదించింది. ప్రస్తుతం చాలా సంస్థలు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్లను అనుమతిస్తూ వయస్సు, ప్రాంతాల కవరేజ్ విస్తరించటం ప్రజలను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ ఏడాది పాలసీల రెన్యూవల్స్ ఆల్ టైం గరిష్ఠాలను తాకేసింది.
ALSO READ : అనిల్ అంబానీ కీలక నిర్ణయం.. ఆ 5 సంస్థలను అమ్మేసిన రిలయన్స్ పవర్..
ప్రధానంగా కంపెనీలు పాలసీదారులకు అందిస్తున్న క్యుములేటివ్ బోనస్, వయస్సు అర్హతలు కొత్త పాలసీల కొనుగోలుకు కూడా పెంచినట్లు తేలింది. అలాగే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఆస్తమా, గుండె వ్యాదులు, ఊబకాయం వంటి వ్యాధి సమస్యల దృష్ట్యా పాలసీలు కొంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇది ముందస్తు జాగ్రత్తలో భాగంగా చాలా మంది పాలసీలు కొనేలా చేస్తోందని తేలింది. అలాగే తక్కువ ప్రీమియం చెల్లింపులతో మంచి కవరేజ్ లభించటంతో చాలా మంది తక్కువ వయస్సులోనే హెల్త్ ఇన్సూరెన్స్ కొంటున్నారని తెలింది.
ఇక రెన్యూవల్స్ సమయంలో ప్రజలు కొత్త రైడర్స్ యాడ్ చేసుకోవటం.. క్లెయమ్స్ తో సంబంధం లేకుండా బోనస్ ప్రతి ఏటా కంపెనీలు అందించటం వంటి నయా ఫీచర్స్ చాలా మందిని రెన్యూవల్స్ దిశగా నడిపిస్తున్నాయి. మెుత్తానికి దేశంలో 30 ఏళ్లు పైబడిన పాలసీదారులే 80 శాతం హెల్త్ ఇన్సూరెన్స్ కొంటున్నట్లు తేలగా.. వీరి నుంచి పాలసీ రెన్యూవల్స్ అధికంగా ఉంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కేవలం నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాలకు చెందిన ప్రజలు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఒక అడుగు ముందే ఉంటున్నారని తేలింది.