
అనిల్ అంబానీ గడచిన కొన్ని వారాలుగా వార్తల్లో మళ్లీ కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు. అయితే ఈడీ సోదాలు, నోటీసులు, విచారణ అంటూ అంబానీ సోదరుడిపై దర్యాప్తుల గురించి అనేక వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీ తమ వ్యాపార యూనిట్లను అమ్మేస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది.
వివరాల్లోకి వెళితే రిలయన్స్ పవర్ తనకు ఇండోనేషియాలో ఉన్న సబ్సిడరీ సంస్థలను సింగపూర్ ఆధారిత బయోట్రస్టర్ అనే సంస్థకు 12 మిలియన్ డాలర్లకు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. 100 శాతం ఇండోనేషియా సబ్సిడరీ విక్రయంలో భాగంగా PT అవనీష్ కోల్ రిసోర్సెస్, PT హెరాంబా కోల్ రిసోర్సెస్, PT సుముఖ కోల్ సర్వీసెస్, PT బ్రయాన్ బింటాంగ్ టిగా ఎనర్జీ, మరియు PT శ్రీవిజయ బింటాంగ్ టిగా ఎనర్జీ సంస్థలు ఉన్నాయని వెల్లడైంది.
ALSO READ : ఇండియా గెలుపును ఆపరేషన్ సిందూర్తో పోల్చిన మోదీ..
ఈ లావాదేవీ డిసెంబర్ 30 నాటికి పూర్తవుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ డీల్ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ రూపంలో అమలు చేయబడిందని, సంబంధిత పార్టీ లావాదేవీల పరిధిలోకి రాదని కంపెనీ ప్రకటించింది. వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరంలో ఇండోనేషియా యూనిట్లు అంబానీ సంస్థకు సున్నా ఆదాయాన్ని అందించాయి. వీటిని రిలయన్స్ పవర్ నెదర్లాండ్స్, రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్ (సింగపూర్) కలిగి హోల్డ్ చేస్తున్నాయి. అందుకే కంపెనీ ప్రస్తుతం ఈ వ్యాపార యూనిట్ విక్రయించినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రిలయన్స్ పవర్ 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.44.68 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసి అంతుకు ముందు ఏడాది నమోదు చేసిన రూ.97.85 కోట్ల నష్టం నుంచి బయటపడింది.