ఫ్రెండ్‌తో బ్రిట్నీ స్పియర్స్ ఎంగేజ్ మెంట్

V6 Velugu Posted on Sep 13, 2021

హాలీవుడ్ నటి, సింగర్ బ్రిట్నీ స్పియర్స్ (39)  మ్యారేజ్ కు సంబంధించి విషయం తెలిపింది. తన ఫ్రెండ్ శామ్ అస్ఘరీతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు ఆమె ప్రకటించింది. ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. ఇందులో ఆమె ఎంగేజ్ మెంట్ రింగ్ ను చూపించింది. 'రింగ్ నీకు నచ్చిందా?' అని ఆమె ప్రియుడు ప్రశ్నించగా... 'ఎస్' అంటూ ఆమె సమాధానం ఇచ్చింది.

2016లో ఓ మ్యూజిక్ వీడియో సందర్భంగా వీరిద్దరూ పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఇన్స్టాలో ఈ పోస్టును చూసిన వెంటనే ఆమె బెస్ట్ ఫ్రెండ్, పాప్ సింగర్, హాలీవుడ్ నటి పారిస్ హిల్టన్ స్పందిస్తూ బ్రిట్నీకి శుభాకాంక్షలు తెలిపింది. బ్రిట్నీ ప్రియుడు శామ్ కూడా నటుడే.

Tagged Britney Spears, announces engagement, boyfriend, Sam Asghari

Latest Videos

Subscribe Now

More News