బ్రో మూవీ నుంచి కీలక అప్డేట్.. ఫుల్ కిక్ లో సాయి ధరమ్

బ్రో మూవీ  నుంచి  కీలక అప్డేట్.. ఫుల్ కిక్ లో సాయి ధరమ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నటిస్తున్న మూవీ BRO. టీజర్ విడుదల అయ్యాక ఫ్యాన్స్ ఈ మూవీ పై మరింత అంచనాలు పెంచేసుకున్నారు. తాజాగా బ్రో సినిమా గురించి హీరో సాయి ధరమ్ తేజ్ కీలక అప్‍డేట్ తెలిపాడు. షూటింగ్ పూర్తయిందని వెల్లడిస్తూ ఫొటోస్ సోషల్ మీడియా లో పంచుకున్నాడు. 

“బ్రో షూటింగ్ పూర్తయింది. ఆస్ట్రియాలోని అందమైన ప్రదేశమైన ఇన్స్‌బక్స్‌లో షూటింగ్ తుది దశ ముగిసింది. నార్డ్‌కేటేలోని ఇన్స్‌బక్స్‌ వద్ద షూటింగ్ ఎక్స్‌పీరియన్ చాలా సంతోషాన్ని ఇచ్చింది. అద్భుతమైన షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన మూవీ యూనిట్‍కు చాలా కృతజ్ఞతలు” అని సాయి ధరమ్ తేజా ఇన్‍స్టాగ్రామ్‍లో టీమ్ తో దిగిన ఫొటోస్ షేర్ చేశాడు. 

తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని (Samutirakhani) తెరకెక్కిస్తున్న బ్రో మూవీలో.. కేతిక శర్మ(Kethiks sharma), ప్రియా ప్రకాష్ వారియర్(Priya prakash variour) హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram)  డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకు తమన్(Thaman) సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమా జులై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా మెగా హీరోలకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.