‘బ్రో’. మూవీ సక్సెస్‌‌‌‌ మీట్

‘బ్రో’. మూవీ సక్సెస్‌‌‌‌ మీట్

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రో’. జీ స్టూడియోస్‌‌‌‌తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా జులై 28న విడుదలైంది. 

సోమవారం మూవీ సక్సెస్‌‌‌‌ మీట్ నిర్వ హించారు. దర్శకులు గోపీచంద్ మలినేని, బాబి, మారుతి, చందు మొండేటి, శ్రీవాస్‌‌‌‌, నిర్మాత ఎస్.కె.ఎన్ పాల్గొని టీమ్‌‌‌‌ను అభినం దించారు. హీరో హీరోయిన్స్‌‌‌‌ సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, దర్శకుడు సముద్రఖని, నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు పాల్గొని సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.