దుర్గమ్మను దర్శించుకున్న బ్రో మూవీ టీమ్

దుర్గమ్మను దర్శించుకున్న బ్రో మూవీ టీమ్

మెగా హీరోలు పవన్ కళ్యాణ్(Pawan kalyan), సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో(Bro). ఈ సినిమా జులై 28న రిలీజై విజయవంతంగా ప్రదర్షింపబడుతోంది. సినిమాకు కూడా ఆడియన్స్ నుండి సూపర్ హిట్ వచ్చింది. దీంతో బ్రో సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. 

ఈ సంధర్బంగా బ్రో చిత్రం విజయోత్సవంలో భాగంగా విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు చిత్ర బృందం. హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు సముద్రఘని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందుకున్నారు. అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డు ప్రసాదాన్ని సాయి ధరమ్ తేజ్, సముద్రఖనికి అందించారు ఆలయ అధికారులు.