రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డ చెట్లు.. నిండు గర్భిణీ ప్రసవ వేదన

రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డ చెట్లు.. నిండు గర్భిణీ ప్రసవ వేదన

ఆసిఫాబాద్ జిల్లా: అడవిలో నిండు గర్భిణీని నడిపించిన సంఘటన మంగళవారం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది.  దహెగాం మండలంలోని మొట్లగూడ గ్రామానికి చెందిన చెన్నూరి శ్యామలకు పురిటి నొప్పులు రావడంతో.. ఆటోలో హాస్పిటల్ కు తీసుకొని బయలుదేరారు. అయితే దారిలో సోమవారం కురిసిన గాలి వానకు రోడ్డుపై చెట్లు విరిగి పడ్డాయి. దీంతో ఆటోను రోడ్డుకు అవతలనే నిలిపివేశారు. అంబులెన్సు కు ఫోన్ చేద్దామంటే చెట్లు విరిగి కరెంట్ పోల్స్ విరగిపడ్డాయి. కరెంట్ కట్ ప్రాబ్లమ్ వల్ల ఊర్లోని ఫోన్లు అన్నీ డెడ్ అయ్యాయి. దీంతో నిండు గర్భిణీ ని నడిపిస్తూ అడవి దాటించిన కుటుంబ సభ్యులు కష్టంమీద ఖర్జి గ్రామానికి చేరుకుని అంబులెన్సు కు ఫోన్ చేశారు. అంబులెన్సులో దహెగాం పీహెచ్ సీ కి తీసుకెళ్లగా సుఖ ప్రసవం జరిగిందని తెలిపిన డాక్టర్లు..కాస్త ఆలస్యమైతే ప్రమాదం ఉండేదన్నారు. వర్షాలతో రోడ్డుకు అడ్డంగా పడ్డ కరెంటు పోల్స్, చెట్లను వెంటనే తొలగించాలని స్థానికులు అధికారులపై సీరియస్ అయ్యారు.