కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ సిటీ రాజీవ్ చౌక్‌లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం తొలిగించి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం రాజీవ్‌చౌక్‌లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా రాజీవ్ చౌక్‌ను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సుడా నిధులు మంజూరు చేసి రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహం ఏర్పాటుకు పనులు ప్రారంభించామని తెలిపారు.
