ప్రేమించినందుకు చెల్లెలి గొంతుకోసిన అన్న

ప్రేమించినందుకు చెల్లెలి గొంతుకోసిన అన్న

ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తిని పెండ్లి చేసుకుంటానన్న చెల్లెలి గొంతు కోశాడు ఓ అన్న. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నంద్యాలలోని నూనెపల్లీ గ్రామంలో జ్యోతి తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది. అయితే తను కొద్ది రోజులుగా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని అతడినే పెండ్లి చేసుకుంటానని వరుసకు అన్న అయిన సుబ్బరాయుడితో ఈ విషయం చెప్పింది. దీంతో ప్రేమపెళ్లి చేసుకోవద్దంటూ వారించాడు సుబ్బరాయుడు. అంతటితో ఆగక.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి జ్యోతిపై కత్తితో దాడి చేశాడు. జ్యోతిని నంద్యాలలోని గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. జ్యోతిని పరిశీలించిన డాక్టర్లు ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం సుబ్బరాయుడు పరారీలో ఉన్నాడని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.