ఐస్ క్రీంలో విషం కలిపి చెల్లిని చంపిన అన్న

ఐస్ క్రీంలో విషం కలిపి చెల్లిని చంపిన అన్న

కేరళలో దారుణం జరిగింది. తోడబుట్టిన చెల్లిని ఏ మాత్రం దయ లేకుండా చంపేశాడో అన్న. ఒంటరిగా బతకాలన్న కోరికతో ఓ 22 ఏళ్ల యువకుడు.. ఐస్ క్రీంలో విషం పెట్టి సొంత చెల్లిని హతమార్చాడు. కాసరగోడ్ కు చెందిన ఒక 16 ఏళ్ల అమ్మాయి ఆగష్టు 5న చనిపోయింది. ఆమెతో పాటు ఆమె తండ్రి కూడా అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. బాలిక విషాహారం తినడం వల్లే చనిపోయిందని వైద్యులు తేల్చారు. బాలిక మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ దర్యాప్తులో పోలీసులకు, కుటుంబసభ్యులకు దిమ్మతిరిగే నిజం తెలిసింది.

దర్యాప్తులో భాగంగా పోలీసులు.. బాలిక అన్న ఆల్బిన్ ను విచారించారు. ఆ విచారణలో ఆల్బిన్ అసలు విషయం చెప్పాడు. తనకు ఒంటరిగా బతకడం ఇష్టమని.. అందుకే ఆగష్టు 4న ఐస్ క్రీంలో విషం కలిపి ఇంట్లో వాళ్లందరికీ పెట్టానని చెప్పాడు. అది తిన్న తన చెల్లి చనిపోయిందని.. తండ్రి బెన్నీ ఆస్పత్రి పాలయ్యాడని తెలిపాడు. తన తల్లి మాత్రం ఐస్ క్రీం తినలేదని తెలిపాడు. ఆల్బిన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

For More News..

ట్రక్కుపై రాళ్లు పడి ఇద్దరు మృతి

కరోనాతో వారంలో భార్యభర్తలు మృతి.. హాజరైన మరో 9 మందికి పాజిటివ్

రాష్ట్రంలో 88 వేలు దాటిన కరోనా కేసులు

ప్రధానిగా మోడీ కొత్త రికార్డు