వర్ధన్నపేట,(ఐనవోలు)వెలుగు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గద్దల ఐలయ్య(73), రాంపూర్ వద్ద వాచ్మెన్. కొద్ది రోజులుగా అనారోగ్యంతో చిక్సిత పొందుతూ సోమవారం చనిపోయాడు. మరణవార్తను అతని అన్న కుటుంబ సభ్యులకు తెలిపారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న అన్న కొమురయ్య (88), తమ్ముడి మరణ వార్త తెలుసుకుని తీవ్ర విషాదానికి లోనయ్యాడు. అర్ధగంట వ్యవధిలోనే కన్ను మూశాడు. ఒకే రోజు గంట వ్యవధిలోనే అన్నదమ్ములు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది .
