
నవంబర్ 3న అమెరికా కొత్త అధ్యక్షుడు ఎవరనేది తేలియాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు అమెరికాతో పాటు, రష్యాలో హాట్ టాపిగ్గా మారాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు పోటీగా జో బిడెన్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బిడెన్ గెలుస్తారని రోయెవ్ రోచీ అనే జూలో ఎలుగుబంటు, పులి కన్ఫామ్ చేశాయి. దీంతో రష్యన్లు సైతం బిడెన్ గెలుపు, ట్రంప్ ఓటమి ఖాయమని నమ్ముతున్నారు.
2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా అధ్యక్షపదవి కోసం ట్రంప్, హిల్లరి క్లింటన్ ను పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ప్రిడిక్షన్స్ తయారు చేశారు. రోయెవ్ రోచీ అనే జూకి చెందిన ఓ గదిలో ట్రంప్, హిల్లరి బొమ్మల్ని డిజైన్ చేసిన పుచ్చకాయల్ని ఉంచారు. గది బయట పులి, ఎలుగుబంటును ఉంచారు. అనంతరం వాటిని జూలోకి వదలగా అవి ఏ బొమ్మ ఉన్న పుచ్చకాయని తింటే..ఆ అభ్యర్ధి గెలుస్తారనే నమ్మకం ఎక్కువగా ఉంది. అలాగే చేశారు. ఎలుగుబంటు, సింహం సైతం ట్రంప్ బొమ్మను డిజైన్ చేసిన పుచ్చకాయని తిన్నాయి.
ఇప్పుడు అదే జూలో 2020 ఎన్నికల్లో బిడెన్, ట్రంప్ బొమ్మల్ని డిజైన్ చేసిన పుచ్చకాయల్ని ప్రదర్శన ఉంచగా ఎలుగుబంటు, సింహం అమెరికా ఎన్నికల్లో గెలిచేది ఎవరో తేల్చాయి. జూ బయట ఉన్న ఎలుగుబంటిని, సింహాన్ని గదిలోపలికి పంపగా సింహంకాని, ఎలుగుబంటి కాని ట్రంప్ బొమ్మ ఉన్న పుచ్చకాయని తినే ప్రయత్నం చేయలేదు. పక్కనే ఉన్న జోబిడెన్ బొమ్మతో డిజైన్ చేసిన పుచ్చకాయని తింటూ ఎంజాయ్ చేశాయి.