రేవంత్ రెడ్డిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి

రేవంత్ రెడ్డిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి

హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లిలో పట్టణంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్కు బీఆర్ఎస్ నేతలు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా...బీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు.  ఓ వైపు రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగానే..మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కండువాలు కప్పుకుని టమాటాలు, కోడిగుడ్లు విసిరారు.  దీంతో సభాస్థలి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

 రేవంత్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు స్థానిక ఊర్వశీ థియేటర్లోకి భారీగా చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య దాడి జరిగే అవకాశం ఉందని తెలియడంతో పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు ఊర్వశీ థియేటర్ కు తాళం వేశారు.