కాంగ్రెస్‌‌‌‌లోకి బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు

కాంగ్రెస్‌‌‌‌లోకి బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణానికి చెందిన పలువురు బీఆర్ఎస్‌‌‌‌, బీజేపీ లీడర్లు కాంగ్రెస్​లో చేరారు. గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌‌‌‌ హాల్‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ముసుకు నారాయణరెడ్డి, లత, బీజేపీ లీడర్లు డాక్టర్ శైలందర్ రెడ్డి, రాయికల్ మండలంలోని పలు గ్రామాల మాజీ సర్పంచులు, నాయకులు అధికార పార్టీలో చేరారు. 

ఎమ్మెల్సీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.