మమ్ముల్నే గెలిపించండి!.. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ అభ్యర్థులు నజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మమ్ముల్నే  గెలిపించండి!..  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ అభ్యర్థులు నజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • వచ్చే  ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని కోరుతున్న నేతలు 
  • తమ నియోజకవర్గాల్లోని వ్యాపారులతో పలువురు మంతనాలు 
  • గెలిపిస్తే సమస్యలు రాకుండా చూసుకుంటామంటూ హామీలు

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో  గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకోవడమే కాకుండా వ్యాపార వర్గాలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ క్యాండిడేట్లు ప్లాన్​తో ముందుకెళ్తున్నారు.  సిటీలో బస్తీలు, మురికివాడలు, కాలనీలు, ఉద్యోగ, కుల సంఘాలు ఇలా అన్నివర్గాల మద్దతు పొందేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యేకించి పలు నియోజకవర్గాల్లోని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులు స్థానిక వ్యాపారులతో భేటీ అయి చర్చిస్తున్నారు. ‘ మేం గెలిస్తే మీకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాం.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాం’.. అనే భరోసా ఇస్తున్నారు. కాంగ్రెస్​, బీజేపీలతో పోలిస్తే బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ క్యాండిడేట్లు ప్రచారంలో సరికొత్త ఎత్తులు వేస్తున్నారు.  సిట్టింగ్‌‌‌‌‌‌‌‌లు మరోసారి గెలిచేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. 

వ్యాపారులతో చర్చలు

గ్రేటర్​ హైదరాబాద్ పరిధిలోని 24  నియోజకవర్గాల్లో వ్యాపార వర్గాలు బాగానే ఉన్నాయి.  గోషామహల్, సికింద్రాబాద్​, సనత్​నగర్, జూబ్లీహిల్స్,  ఖైరతాబాద్, అంబర్​పేట, ఎల్‌‌‌‌‌‌‌‌బీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కుత్బుల్లాపూర్, కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి,  శేరిలింగంపల్లి, ముషీరాబాద్​స్థానాల పరిధిలో అధికంగా కమర్షియల్ సెంటర్లు ఉన్నాయి.  ఆయా ప్రాంతాల్లో ఎక్కువశాతం ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు.  ఇందులో గుజరాతీలు, మార్వాడీలు, సింధి, సిక్కులు వంటి వారితో పాటు  వైశ్య, ఇతర వర్గాలు ఉండగా.. వారి ఓట్లను దక్కించుకునేందుకు బీఆర్ఎస్​ క్యాండిడేట్లు పక్కాగా స్కెచ్​ వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో వారిపై పెద్దగా ఫోకస్ ​పెట్టని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ క్యాండిడేట్లు  ఈసారి మాత్రం వ్యాపారుల ఓట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.   

వేధింపులు  ఉండవని చెబుతూ..

సనత్‌‌‌‌‌‌‌‌నగర్​, సికింద్రాబాద్​, ముషీరాబాద్​ సెగ్మెంట్లలో కొందరు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థుల అనుకూలురు వ్యాపారులను కలిసి మాట్లాడుతున్నారు. ఎల్‌‌‌‌‌‌‌‌బీనగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి,  కుత్బుల్లాపూర్​ ప్రాంతాల్లో జువెలరీ, వస్త్ర, ఎలక్ర్టానిక్స్​, హోం అప్లయన్సెస్​, ఫర్నిచర్, హార్డ్‌‌‌‌‌‌‌‌వేర్, బిల్డింగ్​మెటీరియల్ ​వ్యాపారులు ఉన్నారు. వీరితో పాటు పలు నియోజకవర్గాల్లో పరిశ్రమలు ఉన్నాయి.  వీరి ఓట్లను తమకు పడేలా హామీలు ఇస్తున్నారు. 

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్  మళ్లీ అధికారంలోకి వస్తే వ్యాపారులపై వేధింపులు ఉండవని చెబుతున్నారు. ఈసారి తప్పకుండా తమకే ఓటు వేయాలని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులు వ్యాపారులను కోరుతున్నారు. కొందరు ఒక అడుగు ముందుకేసి ఆత్మీయ సమావేశాలు నిర్వహించి ఆహ్వానిస్తున్నారు.  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులు గెలుపు కోసం ఏ ఒక్క చాన్స్ వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.