ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు బీఆర్ఎస్ ద్రోహం: రామ్ మోహన్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు బీఆర్ఎస్ ద్రోహం: రామ్ మోహన్

 సాగు నీటి విషయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు బీఆర్ఎస్ ద్రోహం చేసిందని పరిగి ఎమ్మెల్యే రాంమ్మోహన్ రెడ్డి అన్నారు. కొందుర్గు లక్ష్మిదేవిపల్లి ప్రాజెక్టు కడతామని మాజీ కేసీఆర్ పరిగిలో నాలుగు సార్లు చెప్పారని, కానీ ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేదని, తమకు రావల్సిన నీళ్లు రాకుండా చేశారని మండిపడ్డారు.

 ‘‘పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేస్త అన్నవ్. పరిగిలో లక్ష ఎకరాలకు నీరు అందిస్తానన్నవ్. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు ఇస్తానన్నవ్. ఏదీ చేయలే. వీటన్నికి సమాధానం చెప్పడానికి నువ్వు సభలో ఉంటే బాగుంటుండే. కానీ ప్రతిపక్ష నేతగా సభకు వచ్చి వీటికి సమాధానం చెప్పకుండా పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి, నల్గొండలో మీటింగ్ పెడ్తా అంటూ రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నావు” అని మాజీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.