జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లకు సరైన సదుపాయాలు కల్పించలేదని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత.. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. బోరబండ సైట్-3లోని 332 పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని ఆమె ఆరోపించారు.
ఇరుకైన గదిలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారన్నారు. మరోవైపు చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యం చేశారని పేర్కొన్నారు. దీనిపైనా తాము ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు.
