బీఆర్ఎస్ ముందుకెళ్లే పరిస్థితి లేదు : విజయశాంతి

బీఆర్ఎస్ ముందుకెళ్లే పరిస్థితి లేదు : విజయశాంతి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: సీఎం కేసీఆర్ చెప్పే బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉండేది కాదు.. ముందుకు వెళ్లేదీ కాదని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. ‘‘బీఆర్ఎస్ ముందుకెళ్లే పరిస్థితి లేదన్న విషయం అందరికన్నా కేసీఆర్ కే బాగా తెలుసు. అయితే, టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ గా మారినందున పక్క రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తుందని కొన్ని ప్రాంతేతర పార్టీలు భ్రమపడి, అవి తెలంగాణలో పని చెయ్యడమే కేసీఆర్ కు అవసరం. అయితే, టీఆరెస్ ఇక బీఆరెస్ కాబట్టి, పక్క రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తాదనే భ్రమతో ప్రాంతేతర పార్టీలు కొన్ని ఈ పరిస్థితిని తమకు అవకాశంగా భావించి తెలంగాణలో పనిచెయ్యటమే కేసీఆర్ కి అవసరం.

ఈ కొత్త పరిణామాలను సాకుగా తీసుకుని మరోసారి.. ప్రాంతేతర పార్టీల దాడి, ఆక్రమణ అంటూ తెలంగాణవాద ప్రజా ఓటు బ్యాంకును టీఆర్ఎస్ వైపు మళ్లించడమే కేసీఆర్ వ్యూహం” అని ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా జరుగుతున్న రోజువారీ సంఘటనలు అందుకు దారి తీసేటట్లుగానే నడుస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. దశాబ్దాల కాలం తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఎందరో తన తోటి ఉద్యమకారులు ఇదే అభిప్రాయాన్ని తనతో పంచుకున్నారని విజయశాంతి పేర్కొన్నారు.