- జగిత్యాలలో మలిదశ ఉద్యమకారుడి ఆవేదన
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- స్పందించి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల రూరల్, వెలుగు : కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని, బీఆర్ఎస్ సర్కార్ లో వివక్షకు గురయ్యాయని తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుడు ఎన్నమనేని శ్రీనివాస రావు ఆవేదన వ్యక్తం చేస్తూ రిలీజ్చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మలిదశ ఉద్యమంలో జగిత్యాల జేఏసీ కో- కన్వీనర్‌గా ఎన్నమనేని శ్రీనివాస రావు పని చేశారు.
ఉద్యమంలో నాయకత్వం వహించి ఆర్థికంగా నష్టపోయానని, తెలంగాణ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ సర్కార్ తనను పట్టించుకోలేదని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అయనా ఆదుకోవాలని కోరాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి అప్పటికప్పుడు ఆర్థిక సాయం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
