రాహుల్పై ఈసీకి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఫిర్యాదు

రాహుల్పై ఈసీకి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఫిర్యాదు
  • ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసినందుకు కంప్లైంట్
  • కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను విమర్శించినందుకు కొండా సురేఖపైనా కూడా.. 

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కాంగ్రెస్  నేత రాహుల్‌‌‌‌ గాంధీపై నిషేధం విధించాలని ఎన్నికల సంఘానికి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  విజ్ఞప్తి చేసింది. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా బ్యాన్  చేయాలని ఈసీకి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  సోమవారం ఫిర్యాదు చేసింది. తుక్కుగూడలో జరిగిన జన జాతర సభలో మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై రాహుల్  గాంధీ నిరాధార ఆరోపణలు చేశారని, కోడ్  ఉల్లంఘన కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది.

కేసీఆర్‌‌‌‌ ‌‌‌‌ ఫోన్ ట్యాపింగ్  చేశారని రాహుల్  ఆరోపణలు చేశారని, ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌తో కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు సంబంధమే లేదని బీఆర్ఎస్  పేర్కొంది. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్  పార్టీ ఇన్​చార్జి దాసోజు శ్రవణ్‌‌‌‌తో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఈసీకి ఫిర్యాదు చేయించింది. రాహుల్‌‌‌‌తో పాటు మంత్రి కొండా సురేఖ మీదా నిషేధం విధించాలని మరో ఫిర్యాదు చేయించింది. కేటీఆర్‌‌‌‌‌‌‌‌పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసినందుకు ఆమె మీద చర్యలు తీసుకోవాలని కోరింది.