
తప్పుడు పత్రాలతో బీఆర్ఎస్ కౌన్సిలర్ తమను బెదిరిస్తున్నారని అరోపించారు భూ యాజమానులు. కుత్బుల్లాపూర్ బహదూర్ పల్లి సర్వే నం.63లో తప్పుడు పత్రాలతో భూ యాజమానులను బెదిరిస్తున్న దుండిగల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ సత్య నారాయణపై కేసు నమోదు చేసినా.. మళ్ళీ తమ పనులకు ఆటంకం కలిగిస్తున్నారని బాధితుల అవేదన వ్యక్తం చేశారు. గతంలో సర్వేల హద్దులు మార్చి నిర్మాణాలు భూ ఆక్రమణ కు పాల్పడుతున్నాడని దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపిన పోలీసులు కౌన్సిలర్ సత్య నారాయణపై కేసు నమోదు చేశారు.
ఒక విధంగా రెవెన్యూ అధికారుల సహకారముతో.. సమస్య కొలిక్కి వచ్చిందని అనుకునే లోపే మళ్ళీ అదే తీరును ప్రదర్శిస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. 520గజాల చొప్పున నలుగురు పై రిజిస్ట్రేషన్ లో ఉన్న 2080 గజాల భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులను తప్పు దోవ పట్టిస్తున్నారని అరోపించారు భూ యాజమానులు. బహదూర్ పల్లి 63 సర్వే నంబర్ లో తమ కష్టార్జితంతో కొనుకున్న 2080 గజాల భూమి కాపాడాలంటు.. అధికారులు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.