పోలీసుల్లో బీఆర్​ఎస్​ కోవర్టులు.. రహస్యాలను గులాబీ నేతలకు చేరవేసుడే వీళ్ల పని!

పోలీసుల్లో  బీఆర్​ఎస్​ కోవర్టులు.. రహస్యాలను గులాబీ నేతలకు చేరవేసుడే వీళ్ల పని!

హైదరాబాద్, వెలుగు: పోలీస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొంతమంది అధికారులు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోవర్టులుగా పనిచేస్తున్నారు. మాజీ మంత్రులకు ప్రభుత్వ సమాచారాన్ని అందిస్తున్నారు. అత్యంత కీలకమైన రహస్యాలను కూడా బీఆర్ఎస్  లీడర్లకు చేరవేస్తున్నారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో వివిధ పోస్టుల్లో పనిచేసిన ఈ పోలీస్​ ఆఫీసర్లు ఇప్పుడు కోవర్ట్ ఆపరేషన్​ను నడిపిస్తున్నట్లుగా ప్రస్తుత ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. తమకు కేటాయించిన విధులను పక్కనపెట్టి మరీ ప్రభుత్వం, డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన రహస్యాలను ఈ కోవర్టులు బయటకు చేరవేస్తున్నారు. ఈ వ్యవహారం పోలీస్​ డిపార్ట్​మెంట్​లో హాట్​ టాపిక్​గా మారింది. ఈ కోవర్టుల్లో ఉత్తర తెలంగాణలో పనిచేసిన నలుగురు పోలీస్​ ఉన్నతాధికారులతోపాటు డీఎస్పీ, సీఐ స్థాయి ఆఫీసర్లు ఉన్నట్లు సమాచారం. 

పైరవీలతో పైకొచ్చినోళ్లే!

గత బీఆర్​ఎస్​ హయాంలో లీడర్ల సిఫార్స్ లెటర్ల ద్వారా తమకు అనుకూలమైన చోట కొందరు పోలీసు ఆఫీసర్లు కీలక పోస్టింగ్స్ పొందారు. అట్ల బీఆర్​ఎస్​కు నమ్మినబంట్లుగా మారిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో వీళ్లలో చాలా మంది అత్యవసర సెలవులు పెడుతున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. ఆరు గ్యారంటీల స్కీమ్స్​అమలు ప్రక్రియపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా ఈ బీఆర్​ఎస్​ కోవర్టులు ప్లాన్​ చేస్తున్నట్లు డిపార్ట్​మెంట్​లో చర్చ నడుస్తున్నది. ఎప్పటికప్పుడు సర్కారు  సమాచారాన్ని బీఆర్​ఎస్​ నేతలకు చేరవేయడం, ప్రభుత్వ కార్యక్రమాలకు కావాలనే దూరంగా ఉండటం వీళ్ల పనిగా మారింది. విషయం తెలసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, డిపార్ట్​మెంట్​ ఉన్నతాధికారులు ఇలాంటి కోవర్టుల కదిలికపై నిఘా పెట్టినట్లు తెలిసింది. 

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నమ్మిన బంట్లుగా పేరు..!

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీకి నమ్మిన బంట్లుగా పేరున్న పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు ఇప్పటికీ ఆ పార్టీ లీడర్లతో టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్లు కింది స్థాయి సిబ్బంది చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్లలో చాలా మందిని ప్రాధాన్యం లేని పోస్టులకు బదిలీ చేశారు. అయితే.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పనిచేసిన పలువురు అధికారులు బీఆర్ఎస్ నేతలతో రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పోలీసు శాఖలో ప్రచారం జరుగుతున్నది. డ్యూటీలు సరిగ్గా చేయకుండా  ఇలాంటి కోవర్టు కార్యకలాపాలకే ఎక్కువ టైమ్​ కేటాయిస్తున్నట్లు సిబ్బంది చర్చించుకుంటున్నారు.