తెలంగాణ అసెంబ్లీ : యూరియాపై BRS రచ్చ.. చర్చకు రెడీగా ఉన్నామన్న మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ అసెంబ్లీ : యూరియాపై BRS రచ్చ.. చర్చకు రెడీగా ఉన్నామన్న మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే.. యూరియాపై చర్చకు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సభలో నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. యూరియా కొరతపై చర్చించాలంటూ పట్టుబడ్డారు. స్పీకర్ సర్దిచెప్పినా.. ఎంతకీ బీఆర్ఎస్ సభ్యులు వినిపించుకోలేదు. షెడ్యూల్ ప్రకారం సభ జరుగుతుందని.. సభ్యులు తమ సీట్లలో కూర్చని మాట్లాడాలంటూ స్పీకర్ పదే పదే విజ్ణప్తి చేసినా వినలేదు బీఆర్ఎస్ సభ్యులు.

బీఆర్ఎస్ పార్టీ సభ్యుల ఆందోళనపై మంత్రి శ్రీథర్ బాబు స్పందించారు. స్పీకర్ అనుమతి ఇస్తే యూరియా కొరతపై చర్చించటానికి సిద్ధంగా ఉన్నామని.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అభ్యంతరాలు ఉంటే.. వాటికి సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. 

యూరియా కొరత, రైతుల ఇబ్బందులపై చర్చించటానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని.. పద్దతి ప్రకారం.. సభ నిబంధనల ప్రకారం వస్తే చర్చకు సిద్ధంగా ఉన్నామని.. సభలో వివరించారు మంత్రి.