- వాటర్ బోర్డ్ డీజీఎంతో వాగ్వాదం
ఎల్బీనగర్,వెలుగు: ప్రోటోకాల్ పాటించకుండా బీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్లను ముందు పెట్టి అధికారిక కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని వాటర్ బోర్డ్ డీజీఎం ఆఫీస్ వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు.
రెండు రోజుల కిందట బీఎన్ రెడ్డి నగర్ లో మంజూరైన పనులను ప్రారంభించకపోవడంపై బీజేపీ కార్పొరేటర్లు లచ్చిరెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, కొప్పుల నరసింహా రెడ్డి, వంగా మధుసూదన్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఏ డివిజన్ లో చూసినా బీఆర్ఎస్ నేతలతో వాటర్ బోర్డ్ అధికారులు కుమ్మక్కవుతున్నారని, తమకు సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని కార్పొరేటర్లు ప్రశ్నించారు.