- ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ నాటకాలు సాగవని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వంపై హరీశ్‌రావు అతి తెలివితో మాట్లాడుతున్నారని, ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఫైర్అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే, బీఆర్ఎస్ నాయకులకు కోల్ టెండర్లు ఎలా వస్తున్నాయని, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? అని నిలదీశారు.
‘‘కేసీఆర్ బంధువులకే టెండర్లు వచ్చాయి. మీకు మాత్రం ముడుపులు ముట్టలేదనే కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పిన.. నిజాలు కావు. సీఎం, డిప్యూటీ సీఎం మీ మాటలను పట్టించుకునే పరిస్థితి లేదు” అని పేర్కొన్నారు.
