జీవన్​రెడ్డి దర్యాప్తుకు సహకరించడం లేదు

జీవన్​రెడ్డి దర్యాప్తుకు సహకరించడం లేదు
  • ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సుప్రీం కోర్టు దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, వెలుగు:భూ వివాదం కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు ఏమాత్రం అందుబాటులోకి రావడం లేదని, ఫోన్ కాల్స్ కు స్పందించడం లేదని తెలిపింది. ఆయన్ను గుర్తించేందుకు మొత్తం స్టేట్ వ్యవస్థ కు డిఫికల్ట్ గా మారిందన్నారు. 

అందువల్ల ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చాలని కోరింది. జీవన్‌‌‌‌రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులు తన భూమిని కబ్జా చేశారని, అదేమని ప్రశ్నిస్తే మారణాయుధాలతో బెదిరించారని దామోదర్‌‌‌‌రెడ్డి అనే వ్యక్తి గతేడాది మోకిల పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ చేశారు. 

ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని జీవన్ రెడ్డి, ఆయన ఫ్యామిలీ మెంబర్లు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా... అందుకు కోర్టు నిరాకరించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ... ఈ ఏడాది మార్చి 21న జీవన్ రెడ్డి, కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై బుధవారం జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ లతో కూడిన విచారణ జరిపింది.