పవర్ సెక్టార్ను నిండా ముంచేశారు: డిప్యూటీ సీఎం భట్టి

పవర్ సెక్టార్ను నిండా ముంచేశారు: డిప్యూటీ సీఎం భట్టి

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను నిండా ముంచారని డిప్యూగీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ పరిశీలన, అవగాహణకు రివ్యూ నిర్వహించిన భట్టి.. తెలంగాణ వచ్చాక బీఆర్ ఎస్ చేతిలో పెడితే అభివృద్ధి చేసిందేమీ లేదని.. అన్ని రంగాలను ఆందోళన కలిగించే దృస్థితికి తెచ్చారని అన్నారు. 

పదేళ్ల పాలనలో 81వేల 514 కోట్ల అప్పులు చేసిన బీఆర్ ఎస్ ప్రభుత్వం.. అన్ని రంగాలను అప్పుల ఊబిగా మార్చిందన్నారు. డిస్కంలకు 28వేల కోట్ల బకాయి పడిందన్నారు. మేముంటే కరెంట్ సాధ్యం అని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందన్నారు. రాష్ట్ర విభజన నాటికి 7వేల 250 కోట్లు బకాయిలు మాత్రమే ఉండేవాన్నారు. 

యాదాద్రి పవర్ ప్రాజెక్టు కు 50 వేల కోట్లు అప్పు గత ప్రభుత్వం చేసిందన్నారు భట్టీ. వాస్తవాలు అన్నీ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామన్నారు.గత ప్రభుత్వం చేసిన అప్పుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు భట్టీ విక్రమార్క. బీటీపీఎస్ నిర్మాణంలో చాలా సమస్యలు ఉన్నాయి. సూపర్ క్రిటికల్ టెక్నాలజీని వాడుకొని పర్యావరణానికి హానీ కలగకుండా మేధావుల సూచనలతో ముందుకెళ్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.