
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోల్పోతోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా ఉరుదొండ వనిత ఎన్నికైన తర్వాత మర్యాద పూర్వకంగా ఆమె షబ్బీర్‌అలీని కలిశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షబ్బీ ర్‌అలీ మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్‌చైర్మన్ పదవిని దుర్వినియోగం చేసిందని గుర్తుచేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి రహిత పాలన అందిస్తోందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్కాంగ్రెస్పై బురద జల్లె ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో వడ్లు కొనుగోలు చేశామని తెలిపారు. ధాన్యం అమ్మిన 94 శాతం మంది రైతుల అకౌంట్లలో ఇప్పటికే డబ్బులు జమ అయ్యాయని చెప్పారు. విత్తనాలు లేవంటూ అబద్ధపు ప్రచారం చేయడం తగదన్నారు. అనంతరం ఉరుదొండ వనితను షబ్బీర్‌అలీ
సన్మానించారు.