- దక్షిణాదిలో ప్రాంతీయ భావోద్వేగాలు ఎక్కువ
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ అంతరిస్తుందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లుగా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. దక్షిణాదిలో స్వీయ ఆత్మాభిమా నం, ప్రాంతీయ అభిమానానికే అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఇందుకు ఎంజీఆర్, ఎన్టీఆర్, కరుణానిధి, జయ లలిత నుంచి ఇప్పటి బీఆర్‌ఎస్, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీల విధానాలను ఒక్కసారి విశ్లేషించు కోవాలని శుక్రవారం ఆమె ట్వీట్ చేశారు.
ప్రాంతీ య భావోద్వేగాలు దక్షిణాదిలో ఎక్కువని, ఈ ప్రాంతాల్లోని ప్రజల సహజ విధానం ఇదన్నారు. దీన్ని కాంగ్రెస్ మాత్రమే అర్థం చేసుకోగలదని అందులో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితిని బీజేపీ కనీసం ఆలోచించే స్థాయిలో కూడా లేదని విమర్శించారు. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
