తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ శాపంగా మారిండు : దాసోజ్‌ శ్రవణ్‌

 తెలంగాణ  రైతాంగానికి సీఎం రేవంత్ శాపంగా మారిండు :   దాసోజ్‌ శ్రవణ్‌

తెలంగాణ  రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి శాపంగా మారాడని విమర్శించారు  బీఆర్ఎస్ నేత  దాసోజ్‌ శ్రవణ్‌. రాజ్యాంగ బద్ధమైన కుర్చీలో కూర్చని సీఎం  నిస్సిగ్గుగా కేసీఆర్ మాట్లాడ్తున్నారని మండిపడ్డారు.  ఎలుకతో కేసీఆర్ ను రేవంత్ పోల్చుతున్నారని..  కేసీఆర్ సింహం లెక్క జనం కోసం కదిలారని చెప్పారు.  హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం దాసోజు శ్రవణ్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 200 మంది రైతులు చనిపోయారంటే ఎక్కడా అని సీఎం అంటున్నారని..  వాళ్లు అడ్రస్ లన్ని మేమిస్తే సీఎంగా నువ్వేందుకు..  మంత్రులెందుకు  అని శ్రవణ్‌ ధ్వజమెత్తారు. 

ఒక పక్క కాలికి గాయమైనా సరే.. తోటి రైతన్నలకు అండగా ఉండాలని బయటకొచ్చారని అన్నారు.  కేసీఆర్ పాలనలో రైతు రాజుగా బతికాడని..  ప్రతి రైతుకు రైతుబంధు, రైతుబీమా అందించి.. వ్యవసాయాన్ని పండుగ చేశారని తెలిపారు. కానీ కాంగ్రెస్ పాలనలో  దుర్మార్గమైన, కుట్రపూరితమైన పాలనతో ఇప్పుడు రైతులు పంటలను తగులబెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, హోమ్ సెక్రెటరీ ని విచారణ చేయాలని రేవంత్ కు సవాల్ విసిరారు రేవంత్.   గత పరిపాలనలో ఏదైనా తప్పులు జరిగి ఉంటే ఎత్తిచూపు కాని.. జరిగిన అభివృద్ధిని జరగలేదని మాట్లాడవద్దని సూచించారు. కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌పై ఉన్న అక్కసుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు.