
కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్యం ధరలపై ఉన్న ధ్యాస ధాన్యం మద్దతు ధరపై లేదని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మద్యంపై ఉన్న ధ్యాస - మంచి బోధన..మందుబిళ్లలు,మూసి బాధితులు, మంచినీళ్లు, పింఛన్ పెంపు , రైతు భరోసా పెంపుపై లేకపాయే అని ధ్వజమెత్తారు.
నాడు అడ్డగోలు ఆరోపణలు చేసి నేడు అడ్డగోలు ధరల పెంచుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. పెంచుకో - దంచుకో - పంచుకో అన్నట్టు ప్రభుత్వ తీరు ఉందని సెటైర్ వేశారు. ఇవాళ మద్యం ధరలు పెంపు..మున్ముందు ఇంకెన్ని పెంచుతారో..ఎంత పెంచుతారో అని అన్నారు.
ALSO READ | బీఆర్ఎస్ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు: టీపీసీసీ చీఫ్