జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దు..హైకోర్టులో పిటిషన్

జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దు..హైకోర్టులో పిటిషన్

జన్వాడలోని  ఫామ్ హౌస్  కూల్చోద్దంటూ హైకోర్టు లో పిటిషన్ దాఖలయ్యింది.  బీఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై గత కొన్ని రోజులుగా హైడ్రా  కొరడా ఝులిపిస్తున్న సంగతి తెలిసిందే..జన్వాడ ఫౌంహౌస్ ఎఫ్ టీఎల్ పరిధిలో ఉండడంతో ఫామ్ హౌస్ ను  హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తు పిటిషన్ వేశారు.  హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని  హైకోర్ట్ లో పిటిషన్ వేశారు.

ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా కమిషన్, రంగారెడ్డి కలెక్టర్,శంకర్ పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను ప్రతి వాదులుగా చేర్చారు పిటిషనర్.

 సిటీ శివారులోని రాజకీయ నేతలు,పలువురు ఫామ్ హౌస్ లపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ నిబంధనలను ఉట్టంఘించి కట్టారా? లేక  111 జీవోను ఉల్లంఘించారా అనే కోణంలో హైడ్రా హెచ్ఎండీఏ, ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి డీటేల్స్ తీసుకుంటున్నారు.  ఒక వేళ నిబంధనలను ఉల్లంఘిస్తే ఫామ్ హౌస్ ను కూల్చేస్తారనే టాక్ వినిపిస్తోంది.