- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
కాగజ్‌నగర్, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు అయినప్పటికీ పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం ఏమిటని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సోమవారం కాగజ్‌నగర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.
పోక్సో కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును మళ్లించేందుకు బండి సంజయ్ కొడుకు కరీంనగర్‌లో అదే బాలిక, ఆమె కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశాడని తెలిపారు.
ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీ ఈ వ్యవహారంపై స్పందించి బండి సంజయ్‌ను సస్పెండ్ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కేసు పెట్టిన కుటుంబాన్ని వేధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బండి సంజయ్‌ను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాలని డిమాండ్ చేశారు.
