కాటమయ్య కిట్లు చేయించింది మేమే : మాజీ మంత్రి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్

కాటమయ్య కిట్లు చేయించింది మేమే :  మాజీ మంత్రి  శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్

హైదరాబాద్, వెలుగు: గీత కార్మికులకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పంపిణీ చేసిన కాటమయ్య కిట్లను తమ ప్రభుత్వ హయాంలోనే తయారు చేయించామని మాజీ మంత్రి, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నేత శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్ అన్నారు. ఎన్నికల కోడ్ వల్ల వాటిని పంపిణీ చేయలేకపోయామన్నారు. 

ఇప్పుడు అవే కిట్లను తమ ప్రభుత్వ ఘనతగా రేవంత్ చెప్పుకుంటున్నాడని ఆయన దుయ్యబట్టారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పల్లె రవి కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. వైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బార్ షాపుల్లో గౌడ కులస్తుల రిజర్వేషన్లను 15 నుంచి 25 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీ గురించి రేవంత్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 

ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఇంకెప్పుడు పెడుతారో చెప్పాలన్నారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతామన్న మాటను నిలుపుకోవాలని సూచించారు. సర్వాయి పాపన్న తిరిగిన 4 వేల ఎకరాల గుట్టలను పరిరక్షించేందుకు పురావాస్తు శాఖకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై కేటీఆర్ కూడా స్పందించారు. కిట్లను తమ ప్రభుత్వ హయాంలోనే తయారు చేయించామని పేర్కొన్నారు.