టెట్ అభ్యర్థులతో కలిసి ఉద్యమిస్తాం :వాసుదేవ రెడ్డి

టెట్ అభ్యర్థులతో కలిసి ఉద్యమిస్తాం :వాసుదేవ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: టెట్ ఫీజు విషయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకోవాలని, లేకుంటే అభ్యర్థులతో కలిసి ఉద్యమిస్తామని బీఆర్ఎస్ నేత వాసుదేవ రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

టెట్‌‌‌‌తో పాటు ఏ ఉద్యోగ పరీక్షకూ ఫీజులు వసూలు చేయబోమని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఆ హామీని ఉల్లంఘించి టెట్ ఫీజును గతం‌‌‌‌లో కన్నా 150  శాతం పెంచారని విమర్శించారు. హరీశ్ రావు పై మంత్రి జూపల్లి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.