
- కేంద్రానికి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు
న్యూఢిల్లీ, వెలుగు: సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహాన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందనపై ఆల్ ఇండియా సర్వీస్ ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని బీఆర్‌ఎస్ నేతలు కోరారు. వారిద్దరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, గత ప్రభుత్వాన్ని విమర్శించినట్లు తెలిపారు.
మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ను ఎంపీలు సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీ బాల్క సుమన్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసి ఫిర్యాదు చేశారు. డీఎస్ చౌహాన్, హరిచందన ఈ నెల 1న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారని వెల్లడించారు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.