కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో బీఆర్ఎస్ లీడర్ల కొట్లాట

కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో బీఆర్ఎస్ లీడర్ల కొట్లాట

తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.  జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లు కేక్ కట్ చేస్తున్నారు. కొన్నిచోట్ల బర్త్ డే వేడుకల్లో పార్టీ నేతలకు నిరసన సెగ తగలగా..మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి.

మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  కేసీఆర్ జన్మదిన వేడుకల్లో  కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. కేక్ కటింగ్ కోసం స్థానిక నేతల మధ్య ఆధిపత్యం తలెత్తడంతో  పలువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.