న్యూస్‌నెట్‌వర్క్, వెలుగు: ఉమ్మడి మెదక్‌జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్నేతలు ఆదివారం ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే సునీతా రెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. జిన్నారం మండల కేంద్రంలో ని అంబేద్కర్‌చౌరస్తా వద్ద బీఆర్ఎస్నాయకులు ధర్నా నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు.
మెదక్పట్టణం, పాపన్నపేట మండల కేంద్రాల్లో బీఆర్ఎస్జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ధర్నా నిర్వహించారు. తూప్రాన్బస్టాండ్వద్ద ఎఫ్డీసీ మాజీ చైర్మన్వంటేరు ప్రతాప్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్అంబేద్కర్చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్బీఆర్ఎస్కార్యకర్తలతో కలిసి రాస్తారోకో చేశారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.