- మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నేతలు
కోల్ బెల్ట్, వెలుగు: కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి మున్సిపల్ఎన్నిక్లలో సత్తా చాటాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. మంగళవారం చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ నేతలు, టీబీజీకేఎస్ యూనియన్ లీడర్లు మంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారికి డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డితో కలిసి మంత్రి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరేలా కార్యకర్తలు పనిచేయాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్లో చేరినవారిలో మాజీ వార్డు సభ్యుడు తీగల రమేశ్, రాస సంపత్, గోమాస కుమారస్వామి, పులి శ్రీనివాస్, ప్రభాకర్, వ్యాపారి ఆడెపు కృష్ణ తదితరులున్నారు. కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపల్ కాంగ్రెస్ లీడర్లు పల్లె రాజు, ఒడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, మహంకాళి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ బొలిశెట్టి కనకయ్య, నీలం శ్రీనివాస్, గోపతి బానేశ్, పార్వతి విజయ తదితరులు పాల్గొన్నారు.
టీఎన్జీవోల సమస్యల పరిష్కారానికి కృషి
మంచిర్యాల, వెలుగు: టీఎన్జీవోల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. మంగళ వారం మంచిర్యాలలలోని మంత్రి స్వగృహంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా డైరీ, క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు వారి సమస్యలు, ఉద్యోగులకు రావలసిన పెండింగ్ డీఏలు, పీఆర్సీలు, బకాయిలను ఇప్పించాలని, మంచిర్యాల కార్పొరేషన్ అయిన సందర్భంగా ఉద్యోగులకు 17 శాతం హెచ్ఆర్ఏ ఇప్పించాలని మంత్రి దృషికి తీసుకెళ్లారు.
సానుకూలంగా స్పందించిన మంత్రి సీఎంతో ఉద్యోగుల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కార్యదర్శి రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీశ్, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
