
హైదరాబాద్, వెలుగు: 2014కు ముందు తెలంగాణలో కరెంటు లేనేలేదన్నట్లు.. రాష్ట్ర ప్రజలకు కరెంటును పరిచయం తామేనన్నట్లు బీఆర్ఎస్ సభ్యులు మాట్లుడుతున్నరని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. అసెంబ్లీలో కరెంటుపై వైట్‌పేపర్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఇక్కడి స్టూడెంట్లు కిరోసిన్ దీపం వెలుగుల్లో చదువుకునే వారని అన్నారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. ‘‘2014 కు ముందు తెలంగాణలో కరెంటు సౌలతే లేనట్లు జగదీశ్‌రెడ్డి చెప్తున్నరు. బుధవారం తాగు, సాగు నీటిపై చర్చ సందర్భంగా కూడా బీఆర్ఎస్ నేతలు ఇదే విధంగా మాట్లాడారు. విద్యుత్ ఇచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వమనే విషయం గుర్తుంచుకోవాలి” అని హితవుపలికారు.