
దాదాపు మూడు ఫుట్‌బాల్ మైదానాల పొడవున్న 2003 MH4 అనే భారీ గ్రహా శకలం సెకనుకు 14 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోందని నాసా తెలిపింది. 1,000 అణు బాంబుల శక్తి కలిగిన ఈ గ్రహశకలం భూమికి ప్రమాదకరంగా దగ్గరగా వెళ్లనునంది. 2025, మే 24న ఈ ఆస్టరాయిడ్ భూమిని దాటి వెళ్లనుంది. దీంతో తక్షణ ముప్పు లేనప్పటికీ ఆస్ట్రరాయిడ్ పరిమాణం, వేగం ఆందోళనలు రేకెత్తిస్తోంది. 2003 MH4 ఆస్టరాయిడ్ భూమి వైపునకు దూసుకొస్తుండటంతో అప్రమత్తమైన నాసా, ఇతర అంతరిక్ష సంస్థల శాస్త్రవేత్తలు టెలిస్కోపులు, రాడార్లతో దాని మార్గాన్ని నిశీతంగా పరిలిస్తున్నారు. ఆస్టరాయిడ్ ప్రయాణిస్తోన్న రూట్‌ను క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నారు.
2003 MH4 అనే గ్రహశకలం డిటైయిల్స్
2003 MH4 అనే ఆస్టరాయిడ్ అపోలో కుటుంబంలో ఒకటి. ఈ ఆస్టరాయిడ్ వ్యాసం 335 మీటర్లు. అంటే.. దాదాపు మూడు ఫుట్‌బాల్ మైదానాల పొడవు. ఈ గ్రహాశకలం సెకనుకు 14 కిలోమీటర్ల (సుమారు 50,400 కిమీ/గం) వేగంతో ప్రయాణిస్తోంది. ఢిల్లీ నుంచి ముంబైకి (సుమారు 1,500కిమీ) ఈ ఆస్టరాయిడ్ ఒక నిమిషం లోపు ప్రయాణించగలదు. 2025, మే 24న భూమి నుంచి 6.68 మిలియన్ కిలోమీటర్ల దూరంలో 2003 MH4 ఆస్టరాయిడ్ వెళుతుంది. ఈ ఆస్టరాయిడ్ భూమి, చంద్రుని కంటే 17 రెట్లు పెద్దది. అంతరిక్ష కక్ష్యలలో 6.68 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లడం అంటే కాస్తా దగ్గర నుంచి వెళ్లడం అన్నట్లే.
గతంలో అపోలో పేరుతో అమెరికా స్పేస్‌లోకి అంతరిక్ష నౌకలను పంపించింది. ఈ అంతరిక్ష నౌకలను వాటి పని అయిపోయాక అంతరిక్షంలోనే పేల్చేసింది. ఆ అంతరిక్ష నౌకల ముక్కలే గ్రహశకలాలుగా తరుచూ భూమిపైకి దూసుకొస్తుంటాయి. ఈ గ్రహా శకలాల వల్ల ఉన్న ప్రమాదం వాటి వేగం. అవి దూసుకొచ్చే వేగంతో భూమిని ఢీకొంటే అణుబాంబుల మాదిరి విధ్వంసాన్ని సృష్టించగలవు. తాజాగా.. భూమిపైకి దూసుకొస్తోన్న 2003 MH4 ఆస్టరాయిడ్ కూడా అపోలో సమూహానికి చెందినదే. అందులోనూ దీని పరిమాణం, వేగం చాలా ఎక్కువ. అయితే.. దీని వల్లే భూమికి ఎలాంటి ప్రమాదం లేదు.
కాకపోతే భూ గ్రహానికి అత్యంత సమీపం నుంచి ఈ గ్రహా శకలం వెళ్లనుండటంతో కొంత ఆందోళన నెలకొంది. ఎందుకంటే.. భూమికి అత్యంత సమీపంగా వెళ్తున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి వలన ఆస్టరాయిడ్ గతి తప్పే ప్రమాదమూ లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అలా జరిగితే గ్రహశకలం కక్ష మారి భూమి వైపు మరింత వేగంగా దూసుకురావొచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆస్టరాయిడ్ మార్గాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. మే 24 సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు ఈ గ్రహ శకలం భూమిని దాటనుంది.