‘‘నా భర్త బికినీ ధరించి డబ్బులు సంపాదిస్తున్నాడు’’.. భార్య సంచలన ఆరోపణ !

‘‘నా భర్త బికినీ ధరించి డబ్బులు సంపాదిస్తున్నాడు’’.. భార్య సంచలన ఆరోపణ !

లక్నో: ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రభుత్వ డాక్టర్పై అతని భార్య సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త ఆడవాళ్ల దుస్తులు ధరించి.. ట్రాన్స్జెండర్లా ప్రవర్తిస్తున్నాడని చెప్పింది. అమ్మాయిలా డ్రస్ చేసుకుని.. హాట్ హాట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, ఎక్స్పోజ్ చేస్తూ ఫొటోలను.. వీడియోలను ఆన్ లైన్లో అప్ లోడ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడని ఆరోపించింది.

ఆ ప్రభుత్వ డాక్టర్ అలా లేడీలా డ్రస్ చేసుకున్న ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ కావడంతో అతని భార్య ఆరోపణలకు బలం చేకూరినట్టయింది. అయితే.. తన భార్య ఆరోపణలను ఆ గవర్నమెంట్ డాక్టర్ ఖండించాడు. డీప్ ఫేక్ టెక్నాలజీ వాడి తన ఫేక్ ఫొటోలను తన భార్య వైరల్ చేసిందని.. తన ఆస్తి కోసమే తనను బదనాం చేసి ఇలా రచ్చ చేస్తోందని ఆ ప్రభుత్వ వైద్యుడు చెప్పుకొచ్చాడు. ఆ డాక్టర్ను వరుణేష్ దూబేగా పోలీసులు గుర్తించారు.

ప్రభుత్వ వైద్యుడిగా తనకు ఇచ్చిన క్వార్టర్స్లోనే అమ్మాయిలా డ్రెస్ చేసుకుని ఇలాంటి ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తున్నాడని అతని భార్య సింపీ పాండే ఆరోపించింది. ఆమె పోలీసులకు ఇచ్చిన ఫుటేజీలో ఆ డాక్టర్ ఇంట్లోని ఫర్నిచర్ కనిపించడంతో పోలీసులు సదరు డాక్టర్ పై అనుమానం వ్యక్తం చేశారు. అతని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొందరు మగాళ్లతో కలిసి బికినీలో కనిపిస్తూ తన భర్త అశ్లీలమైన పనులు చేసి.. ఆ వీడియోలను, ఫొటోలను నీలి చిత్రాల వెబ్ సైట్లకు అమ్ముకుని డబ్బు సంపాదించుకుంటున్నాడని డాక్టర్ భార్య ఆరోపించింది. ఇదిలా ఉండగా.. ఈ భార్యాభర్తలకు ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడు.